యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల తయారీ (VIDEO)

73చూసినవారు
తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయ్యింది. ప్రధాన నిందితుడు కర్ణాకర్ యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నట్లు గుర్తించారు. కుంట్లూరు కేంద్రంగా ఈ దందా సాగుతుండగా, రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.8 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ ఎస్‌వోటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్