TG: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ రూ.200 నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం జరిగిన సంతలో రూ.200 నోట్లను తీసుకువచ్చి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేశారు. కూరగాయలు విక్రయించే వ్యక్తి మరో వ్యక్తికి ఇవ్వగా ఆ నోట్లు నకిలీవని తెలిసింది. అన్ని నోట్లపై ఒకే సీరియల్ నంబర్లు ఉండడంతో నకిలీ నోట్లుగా గుర్తించారు. కేటుగాళ్లు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని దొంగ నోట్ల చలామానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.