అంతర్జాతీయ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం వల్ల బరువు తగ్గించే ఇంజెక్షన్లకు డిమాండ్ పెరిగింది. అయితే, మార్కెట్‌లోకి నకిలీ, నాసిరకం ఇంజెక్షన్లు వస్తున్నాయని, ఇవి శరీర అంతర్గత అవయవాలపై తీవ్ర విష ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ప్రమాదకర రసాయనాలు లేదా కలుషిత ద్రవాలు ఉండవచ్చు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. యాంటీబయాటిక్ నిరోధకత కూడా పెరుగుతుందని వైదులు అంటున్నారు.