
తన ‘కృత్రిమ కాళ్ల’ను టేబుల్‌పై పెట్టి.. ప్రతిపక్షాలను నిలదీసిన ఎంపీ
కేంద్రాన్ని గుడ్డిగా వ్యతిరేకించవద్దని, జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని బీజేపీ ఎంపీ సి.సదానందన్ మాస్టర్ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన తొలి ప్రసంగం చేస్తూ, తన రెండు కృత్రిమ కాళ్లను టేబుల్‌పై పెట్టి విపక్షాలను నిలదీశారు. 31 ఏళ్ల క్రితం కేరళలో తనపై జరిగిన దాడిలో కాళ్లు కోల్పోయినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.




