
కర్ణాటకలో దారుణం.. రూ.2.5 లక్షల కోసం స్నేహితుడిని చంపాడు
కర్ణాటకలోని చిక్కమగళూరులో దారుణం జరిగింది. మాజీ భార్యకు బహుమతులు కొనేందుకు డబ్బు అవసరమై, షఫీ అనే వ్యక్తి తన స్నేహితుడు పుట్టరాజును హత్య చేసి రూ.2.5 లక్షలు దోచుకెళ్లాడు. ఫిబ్రవరి 19న బంగారం వేలం పేరుతో నమ్మించి, పుట్టరాజును తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ దొంగిలించిన డబ్బుతో విడిపోయిన తన రెండో భార్యకు టీవీ కొనిచ్చి, రూ.60 వేలు నగదు బహుమతిగా ఇచ్చాడు. పోలీసులు నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్టు చేశారు.




