200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ.. రథంలో ఇంటికి తీసుకొచ్చిన కుటుంబం

6చూసినవారు
మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో దహిఫాలే కుటుంబంలో సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన గార్గి అనే నవజాత శిశువును ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాలు, పాటలు, నృత్యాలతో జరిగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. గార్గి పుట్టుకతో కుటుంబంలో ఆడపిల్ల లేని లోటు తీరిందని, ఇది తమకు ఎంతో అదృష్టమని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్