TG: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పోస్ట్ చేసినందుకు యువకుడిని ఆమె కుటుంబసభ్యులు కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్, అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ కావడంతో ఆగ్రహించిన యువతి బంధువులు సతీష్‌పై దాడి చేసి హతమార్చారు.