పెళ్లికి పట్టుబట్టిందని.. విషం ఇచ్చి చంపిన ప్రియుడి కుటుంబం

16చూసినవారు
పెళ్లికి పట్టుబట్టిందని.. విషం ఇచ్చి చంపిన ప్రియుడి కుటుంబం
రాజస్థాన్‌లో పరువు హత్య కేసులో టోంక్‌ ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించింది. జైపూర్‌కు చెందిన సుమన్‌ (25), ప్రధాన్‌ ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలవారు కావడంతో పెళ్లికి ప్రధాన్‌ నిరాకరించగా.. సుమన్‌ పట్టుబట్టింది. దీంతో కుటుంబంతో కలిసి ఆమెను హతమార్చేందుకు ప్రధాన్‌ కుట్ర పన్నాడు. 2022లో శ్రాద్ధ కార్యక్రమం పేరుతో పిలిచి విషం తాగించి చంపారు. పాము కాటుతో మృతి చెందినట్లు నమ్మించారు. అయితే సుమన్‌ ATM నుంచి ప్రధాన్‌ రూ.80 వేలు డ్రా చేయడం, పోస్టుమార్టంలో విషం వల్లే మృతి చెందినట్లు తేలడంతో హత్య బయటపడింది. ఈ కేసులో కోర్టు నలుగురికి జీవిత ఖైదుతో పాటు రూ.1.35 లక్షల జరిమానా విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్