ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావంతో గాజాలో క్షామం నెలకొంది. ఐక్యరాజ్యసమితి ఐపీసీ తొలిసారి అయిదో దశ హెచ్చరిక జారీ చేసింది. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని 59 పేజీల నివేదికలో వెల్లడించింది. ఈ నెలాఖరులోగా దుర్భిక్షం డెయిర్ అల్ బాలాహ్, ఖాన్ యూనిస్ వరకు విస్తరించనున్నట్లు హెచ్చరించింది. అయితే ఈ నివేదిక అసత్యమని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీనిపై యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆవేదన వ్యక్తం చేశారు.