అత్తను తలపై మోస్తూ.. 260 కి.మీ.ల పాదయాత్ర చేపట్టిన ప్రముఖ సింగర్

60చూసినవారు
అత్తను తలపై మోస్తూ.. 260 కి.మీ.ల పాదయాత్ర చేపట్టిన ప్రముఖ సింగర్
తన అత్త కోరిక నెరవేర్చేందుకు హరియాణాకు చెందిన ప్రముఖ జానపద గాయని కాజల్ చౌధరీ అరుదైన సాహసం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల అత్త చంద్రీదేవిని ప్లాస్టిక్ టబ్బులో కూర్చోబెట్టి 260 కిలోమీటర్ల ‘బ్రిజ్ పరిక్రమ’ పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర, బృందావన్‌తో పాటు హరియాణా, రాజస్థాన్‌లోని పలు పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తున్నారు. సాధారణంగా ఈ యాత్రకు 40 రోజులు పడుతుంది. కాగా, ‘‘మా అత్తయ్య నన్ను సొంత బిడ్డలా ఆదరించింది. ఆమె రుణం తీర్చుకోవడం నా ధర్మం’’ అని కాజల్ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :