తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలిపై బెంగళూరు సెషన్స్ కోర్టు నేరాభియోగాలు నమోదు చేసింది. మొత్తం 17 మంది నిందితులు తాము ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానం ముందు తెలిపారు. కోర్టు గది నిండిపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ, సంబంధంలేని న్యాయవాదులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. నవంబర్ 10కి తదుపరి విచారణ వాయిదా పడింది. అనంతరం దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను జైలుకు తరలించారు.