ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు అక్టోబర్ 19 నుంచి ఆసీస్ జట్టుతో వన్డే సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్‌కు ముందు పెర్త్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను చూడటానికి అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అభిమాని పిల్లాడికి ఆటోగ్రాఫ్ ఇవ్వగా ఆ పిల్లాడు ఆనందంతో మైదానంలో పరుగులు తీసి దొర్లి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.