
ఓజీ సినిమా షోలో సౌండ్ బాక్సులు కూలి ఇద్దరికి గాయాలు
TG: భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో గురువారం ఉదయం పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా అవాంతరం చోటుచేసుకుంది. పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో థియేటర్లోని సౌండ్ బాక్సులు ఊడి కిందపడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రేక్షకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక దవాఖానకు తరలించారు. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని అనుమతించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.




