
రామతీర్థంలో సముద్ర స్నానాలపై ఆంక్షలు
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం వద్ద సముద్రం పోటు కారణంగా భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు. సముద్రంలో మునగకుండా కేవలం నీటిని నెత్తిన చల్లుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే మెరైన్ పోలీసులు, రామతీర్థ ఎస్ఐ ఆధ్వర్యంలో బీచ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు మహిళలు సముద్రంలోకి వెళ్లగా, పోలీసులు వారిని కాపాడారు.




