
బోనం అంటే ఏంటి? ఈ పండుగ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి, ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. సంస్కృత పదం 'భోజనం' నుండి ఉద్భవించిన బోనం, గ్రామ దేవతలకు సమర్పించే పవిత్ర నైవేద్యం. ఆడపడుచులు కొత్త బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం వండి, మట్టి లేదా లోహపు కుండల్లో అలంకరించి, తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య దేవాలయాలకు తరలివెళ్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలను పూజించడం ద్వారా అంటువ్యాధులు రాకుండా, ఊరు సల్లంగా ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం.




