
మ్యాట్రిమోనియల్ సైట్ పరిచయం.. పెళ్లి పేరుతో రూ.14.8 లక్షలు దోచుకుని, అత్యాచారం
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగపూర్లో మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన రాఘవేంద్ర కిషోర్ అవస్థి (36) అనే వ్యక్తి, 31 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.14.8 లక్షలు మోసం చేసి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జిమ్ వ్యాపారం కోసం పెట్టుబడి పేరుతో డబ్బులు తీసుకున్నాడు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా ఈ కుట్రలో సహకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




