తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల జమలో రికార్డ్ సృష్టించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. 5 రోజుల్లోనే రూ.7,135.77 కోట్లను 67.45 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. శనివారం 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతులకు రూ.545.41 కోట్లను బ్యాంకు అకౌంట్లలో జమ చేశామని మంత్రి తెలిపారు. దీంతో ఇప్పటికే 85 శాతం నిధుల జమ పూర్తైనట్లే. మరో 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇకపై డబ్బులు జమ చెయనుంది.