TG: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ధరావత్ బాలు (50)కు పాము కాటు వేసింది. చెట్ల పొదల్లోంచి వచ్చిన పాము కరవడంతో రైతు నేలకొరిగాడు. తోటి రైతులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు లేకపోవడంతో సూర్యాపేటకు తరలించారు. ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు ఇది తాజా ఉదాహరణ.