విషాదం.. పిడుగుపాటుతో వ్యక్తి మృతి

1044చూసినవారు
విషాదం.. పిడుగుపాటుతో వ్యక్తి మృతి
TG: పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి జంగా సుధాకర్ రెడ్డి (65) అనే రైతు తన పొలంలో మృతి చెందాడు. మధ్యాహ్నం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో రైతు సుధాకర్ రెడ్డి మామిడి చెట్టు కింద ఉండగా పిడుగు పడి మరణించినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్