AP: కడప జిల్లా అట్లూరు మండలంలోని రాచుపల్లెలో విషాదం నెలకొంది. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో రైతు అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.