
యమునలో పడవ మునక.. ఆరుగురు గల్లంతు (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పడవ బోల్తాపడి ఆరుగురు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది ముగ్గురిని రక్షించగలిగారు. బుధవారం ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఎస్డీఎం అభిషేక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పడవలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని తెలిసింది. జబల్పూర్ ఘటన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.




