
10 ఏళ్లలో వారు 50వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదు: మోదీ
గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో 50వేల టాయిలెట్లు కూడా నిర్మించలేదని, తాము మాత్రం 50వేల రైలు కోచ్‌లను నిర్మించామని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేవారు ప్రతి కూడలిలోనూ కనిపిస్తారని, అయితే భారత యువత సత్యం బాటలో నడుస్తోందని, వారే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.




