రైతు కళ్లలో కారం కొట్టి రూ.25 లక్షల దోపిడీ

46చూసినవారు
రైతు కళ్లలో కారం కొట్టి రూ.25 లక్షల దోపిడీ
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ జిల్లాలో తమోయియా చక్‌ గ్రామానికి చెందిన 47 ఏళ్ల రైతు లఖ్విందర్‌ కళ్లలో కారం కొట్టి, అతని వద్ద ఉన్న రూ.25 లక్షల నగదును ముగ్గురు దొంగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ శర్మ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :