TG: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామానికి చెందిన రైతు పెనక ప్రవీణ్, నాలుగు రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో తన జంట ఎద్దుల్లో ఒకదాన్ని కోల్పోయాడు. ఆర్థిక స్తోమత లేక, మిగిలిన ఎద్దుతో పాటు తానే నాగలికి కట్టి పొలం దున్నాడు. తన భుజాన నాగలి మోస్తూ, చెమటలు కారుతున్నా పంటపై ఆశతో సాగు పనులు కొనసాగించాడు. ఈ దృశ్యం చూసిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ ప్రమాదంలో ఎద్దును కోల్పోయిన రైతుకు ప్రభుత్వం తక్షణమే పరిహారం, ప్రత్యామ్నాయంగా కాడెద్దు లేదా ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.