కొండారెడ్డిపల్లిలో కరెంట్ కోసం రైతులు రోడ్లెక్కుతున్నారు: కౌశిక్ రెడ్డి

1చూసినవారు
కొండారెడ్డిపల్లిలో కరెంట్ కోసం రైతులు రోడ్లెక్కుతున్నారు: కౌశిక్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో BRS MLA పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కరెంట్ రావడం లేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరెంట్ ఇస్తాలేరని రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తున్నారని, అలాంటిది ముఖ్యమంత్రి సిరిసిల్లకు వచ్చి చేసేది ఏముంటుందని విమర్శించారు. తమ సమస్యలు తీర్చాలని సీఎం సొంత ఇలాకా కొడంగల్ ప్రజలు కేటీఆర్, హరీశ్ రావుల వద్దకు వస్తున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్