TG: జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకూ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుంది. అయతే వీరు ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకుంటేనే డబ్బులు అందే అవకాశం ఉంది. ఆధార్, పట్టా పాస్‌బుక్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, దరఖాస్తు ఫాం నింపి ఏఈవోలకు అందజేయాలి. కాగా రేవంత్ సర్కార్ జూన్ 30 నుంచి రైతుభరోసా నిధులను (ఎకరానికి రూ.6వేలు) విడతల వారీగా విడుదల చేస్తోంది.