TG: రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు జమవుతున్నాయి. రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సీఎం రేవంత్ మంగళవారం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం 10 గంటల నుంచి అర్హులైన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు మెసేజ్‌లు వచ్చినట్లు పలువురు రైతులు చెబుతున్నారు. మరోవైపు వారంలోగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ‘రైతు భరోసా’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు.