జామాయిల్ సాగుతో రైతులకు లాభాలు

80చూసినవారు
జామాయిల్ సాగుతో రైతులకు లాభాలు
అధిక శ్రమ లేకుండా చేపట్టే జామాయిల్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చు. జామాయిల్ చెట్లను పేపర్ ఇండస్ట్రీలకు కావలసిన గుజ్జు తయారీకి, కలప, ఫర్నిచర్, ప్లైవుడ్ వంటి వాటికి వినియోగిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా జామాయిల్ సాగుకు నష్టం ఉండదు. ఎకరానికి 1000 మొక్కలు నాటొచ్చు. సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరానికి 60 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో టన్నుకు ప్రస్తుతం రూ.5500 వరకు ధర వస్తోంది.

ట్యాగ్స్ :