TG: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా చెన్నారం గ్రామానికి చెందిన రైతు అచ్చయ్య, తన పత్తి పంటను కాపాడుకోవడానికి కుటుంబంతో కలిసి కష్టపడుతున్నారు. DCM వాహనం ద్వారా డ్రమ్ముల్లో నీళ్లు తెప్పించి, పైపులు, బకెట్ల సాయంతో పత్తి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఈ దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి.