సిద్దిపేట జిల్లాలో రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఎన్సన్‌పల్లి వద్ద సిద్దిపేట-తోగుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.