రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టమన్నారు: KTR

4038చూసినవారు
TG: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే రాళ్లతో కొట్టమని అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలి.. రేవంత్ రెడ్డిని కొట్టాలా? ప్రకాశ్ గౌడ్‌ను కొట్టాలా' అని KTR ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్