రైతులకు లాభాలనిచ్చే పంట కొత్తిమీర. తక్కువ ఖర్చుతో వేగంగా దిగుబడి ఇవ్వడం, మార్కెట్ డిమాండ్ ఎప్పుడూ ఉండటం వల్ల రైతులు పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అన్ని రకాల నేలల్లో కొత్తిమీర సాగు సాధ్యమే కానీ నీరు నిల్వ, అధిక ఎండలు పంటపై ప్రభావం చూపుతాయి. నేలను రెండు మూడు సార్లు దున్ని చిన్న మడులు తయారు చేసి 1 సెం.మీ లోతులో విత్తనాలు విత్తాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువులు, నత్రజని ఎరువులు వాడితే మంచి ఎదుగుదల ఉంటుంది. మార్కెట్‌లో డిమాండ్ ఉంటే రైతుకు లాభం ఉంటుంది.