ఇండోనేషియాలోని ట్రాన్స్–సుమత్రా హైవేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 16 మంది సజీవ దహనమయ్యారు. సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని నార్త్ ముసి రావాస్ రీజెన్సీలో ఈ విషాదం చోటుచేసుకుంది. లుబుక్లింగావ్ నుండి జంబీ నగరం వైపు వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ అదుపు తప్పి కుడివైపు మళ్లించారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, 13 మంది ప్రయాణికులు, ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ఉన్నారు.