
త్వరలో అందుబాటులోకి ‘హరిత యూరియా’
ప్రకృతిని కలుషితం చేసే కెమికల్ యూరియాకు చెక్ పెట్టే సమయం వచ్చింది. స్వీడన్ స్టార్టప్ ‘నైట్రోక్యాప్ట్’ కాలుష్య రహిత పద్ధతిలో నత్రజని ఎరువును తయారు చేస్తోంది. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా పునరుత్పాదక ఇంధనం వాడుతూ గాలిలోని నత్రజనిని విచ్ఛిన్నం చేయటం ద్వారా హరిత యూరియా ఉత్పత్తి చేస్తారు. దీనిని ఆవిష్కరించి ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025’ను ఇటీవల నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్బెర్గ్ అందుకున్నారు.




