యూపీలోని హత్రాస్(D) సాదాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు, ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.