ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది స్పాట్‌డెడ్

5చూసినవారు
ఘోర బస్సు ప్రమాదం.. 11 మంది స్పాట్‌డెడ్
ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్య ఇరాన్‌లోని మార్కాజీ ప్రావిన్స్‌లో సావే-హమేదాన్ ఫ్రీవేపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అలసట, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రావిన్షియల్ ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు రాష్ట్ర టెలివిజన్ వెల్లడించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్