చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో, ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.