ఘోర బస్సు ప్రమాదం.. ప్రయాణికుల్లో HYD వాళ్లే ఎక్కువ!

24201చూసినవారు
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కర్నూలు నగర శివారులో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. కాగా డైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.