కాంగోలోని కోల్‌వేజీ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ దేశ గనుల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ క్రమంలో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో ప్రయాణిస్తున్న మంత్రి, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే విమానం పూర్తిగా దగ్ధమైంది.