ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి (వీడియో)

27చూసినవారు
జమ్ముకాశ్మీర్‌లోని బుద్గామ్‌లో డంపర్, సుమో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి వాటర్వాణి రింగ్‌రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు మహ్వారా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్