AP: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.