కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ (వీడియో)

27884చూసినవారు
TG: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్, ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొనడంతో 3 సంవత్సరాల బాలుడు, మహిళ, వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరు నెలల పాప పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్