కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఉదయగిరి డిపో బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏపీకి చెందిన 20 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.