
వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్.. దంపతులు మృతి
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య, లక్ష్మి దంపతులు శుక్రవారం వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. కౌలుకు తీసుకున్న పొలంలో వరి పంట సాగు చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




