
డాడీ వద్దు అన్నా వినలేదు.. నా కళ్ల ముందే నరికేశాడు: కూతురు అపర్ణ
TG: వికారాబాద్ జిల్లా కులకచర్లలో తన తండ్రి చేతిలో హత్య నుంచి తప్పించుకున్న పెద్ద కూతురు అపర్ణ చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. తనను, చెల్లిని చంపొద్దని ఎంత వేడుకున్నా తన తండ్రి వినలేదని చెప్పింది. 'డాడీ వద్దు.. డాడీ డాడీ చంపొద్దు అన్నా కూడా మా నాన్న వినలేదు' అని ఏడ్చింది. కాగా ఇవాళ తెల్లవారుజామున తన భార్య అలివేలు, చిన్న కూతురు, వదినను చంపి.. యాదయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.




