జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

11చూసినవారు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
TG: జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల గణపురం మండలం వడిచర్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన సయ్యపురాజు విష్ణువర్ధన్ అలియాస్ బబ్లు (32) మృతి చెందారు. ఏపీలోని విజయవాడకు చెందిన సయ్యపురాజు, రాంప్రసాద్, లవ కుమార్, శరత్ కుమార్ రామగుండంలో జరిగిన ఈవెంట్‌కు వెళ్లారు. రామగుండం నుంచి తిరిగి వస్తున్న కారు, రోడ్డు పక్కన నిలిపిన డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులోని మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని జనగామ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్