ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు స్పాట్‌డెడ్

11చూసినవారు
మధ్య ప్రదేశ్ ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును ఓ కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు ఎగిరిపడ్డారు. ఇందులో ఆయుష్, కృష్ణపాల్ అనే విద్యార్థులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో స్టూడెంట్ గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరగ్గా తాజాగా సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కారులో ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి శివమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్