AP: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరులోని కోలలపూడి జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి పితృదేవతలు పిండప్రదానం చేయడానికి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులు లక్ష్మణ్(70), సుబ్బాయమ్మ(65), హేమంత్(25)గా గుర్తించారు.