TG: గణపతి నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. వనపర్తి జిల్లా నాచహల్లికి చెందిన 12 మంది బీచుపల్లి దగ్గర వినాయక నిమజ్జనానికి వెళ్లారు. శుక్రవారం వేకువజామున తిరిగి ట్రాక్టర్‌పై వస్తున్న వారిని రంగాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వెనుక నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్‌పై కూర్చొన్న సాయి(25), శంకర్ (28) మరణించారు. గాయాలైన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.