ఉత్తరప్రదేశ్‌లోని చునర్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న భక్తులను రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వేగంగా వచ్చిన రైలు భక్తులను ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాల శరీర భాగాలు పట్టాలపై పడి ఉన్న దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. భక్తులు ప్రయాగ్‌రాజ్ వెళ్లి వస్తుండగా.. రైల్వే స్టేషన్‌కు వచ్చి ప్లాట్‌ఫామ్‌పై కాకుండా ట్రాక్ వైపు దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.